టచ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కు కవర్ ను కూడా వాడుతారు.ఫోన్ కింద పడిన లేదా ఇంకేమైనా డ్యామేచ్ కాకుండా ఈ కవర్ ఉపయోగపడుతుంది. అయితే ఫోన్ కలర్ కనిపించేందుకు చాలా మంది ట్రాన్స్‌పరేంట్ పౌచ్‌లను ఉపయోగిస్తారు..అందులోనూ ఆ కవర్ ఫోన్లకు ఉచితంగా ఇస్తున్నారు.అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పౌచ్‌లు యెల్లో కలర్‌లోకి మారిపోతుంటాయి. మీలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉంటారు కదూ.. ఇంతకీ పౌచ్‌ల రంగు ఎందుకు మారుతుంది వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి? లాంటి వివరాలను ఓసారి చూసెయ్యండి..
మాములుగా ఈ ట్రాన్స్‌పరేంట్ కవర్‌లను TPU (థర్మో ప్లాస్టిక్ పాలీ యురేథిన్) మెటీరియల్‌తో తయారు చేస్తారు. కవర్ రంగు మారడానికి ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు మరియు వేడి. సూర్యుడి నుంచి కిరణాలకు కవర్‌లోని టీపీయూ కెమికల్స్ రియాక్షన్ అవుతాయి. దీంతో రంగు మారుతుంది. అలాగే ఫోన్ చార్జింగ్ చేసేప్పుడు లేదా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే వేడి వల్ల కూడా రంగు మారుతుంది. ఇక రంగు మారడానికి మరో కారణం చేతి నుంచి వచ్చే చెమట, ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కవర్‌ను ఆక్సిడేషన్‌కు గురి చేస్తుంది. ఈ కారణంగానే ఫోన్ కవర్ యెల్లో కలర్‌లోకి మారుతుంది.
ఎలా క్లీన్ చేసుకోవాలి..
రంగు మారిన కవర్ మళ్లీ పాత రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు డ్రాప్స్ డిష్ వాష్ సోప్‌ను వేడి నీటిలో కలపాలి. అనంతరం పాత బ్రష్‌ను తీసుకొని ఫోన్ కవర్‌పై రుద్దాలి. అనంతరం నీటితో కడిగితే చాలు మళ్లీ పాత రంగులోకి వచ్చేస్తోంది. ఇక బేకింగ్ సోడాతో కూడా కవర్ రంగు మార్చుకోవచ్చు. బేకింగ్ సోడా వేసి కాస్త నీటిని యాడ్ చేసి బ్రష్‌తో క్లీన్ చేస్తే సరి మళ్ళీ ఆ కవర్ పాత రంగులోకి వస్తుంది..