”దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇమ్యూనిటీ టెస్టులు చేస్తే.. వారి రోగ నిరోధక శక్తి ఎంత ఉన్నదీ తెలుస్తుంది కదా. అప్పుడు శక్తి ఎక్కువగా ఉన్నవారికి బయట తిరిగేందుకు అనుమతిచ్చి, తక్కువగా ఉన్నవారిని ఇంట్లోనే ఉండమని చెప్పి.. లాక్‌డౌన్ ఎత్తేయవచ్చు కదా…” ఇదీ.. కొందరిని వేధిస్తున్న ప్రశ్న. నిజంగా ఇలా చేస్తే కరోనాను అంతం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఎటూ వైరస్ వ్యాప్తి చెందదు కనుక.. జనాలు నెమ్మదిగా బయటకు వస్తారు. దీంతో లాక్‌డౌన్ నుంచి పూర్తిగా బయటపడవచ్చని.. కొందరు అనుకుంటున్నారు. అయితే ఆలోచిస్తే.. ఇదేదో బాగానే ఉంది.. కానీ ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేయడం లేదు..? అంటే.. అందుకు సరైన కారణాలే ఉన్నాయి. అవేమిటంటే…
ఇమ్యూనిటీ టెస్టులు చేయడం వల్ల ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎంత ఉన్నదీ తెలుస్తుంది. దాంతో ఆ శక్తి ఎక్కువగా ఉన్నవారిని బయట తిరిగేందుకు అనుమతి ఇవ్వవచ్చు. ఇది బాగానే ఉంది. కానీ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పి ఎవర్నయినా సరే.. విచ్చలవిడిగా బయట తిరగమని చెప్పలేరు. ఎందుకంటే.. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే రోగాలు రావని 100 శాతం సైంటిస్టులు, వైద్యులు చెప్పడం లేదు. ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు రోగాలు రాకుండా ఉండేలా చూస్తుంది, కరెక్టే.. కానీ అది కొంత వరకే.. కరోనా విషయంలో దాన్ని సాకుగా చూపలేం. ఎందుకంటే.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి కరోనా సోకదని ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఆ శక్తి ఎక్కువ ఉన్న వారికి కూడా వైరస్ సోకవచ్చు. కాకపోతే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ప్రాణాంతకం కాదు.. అంటే.. తీవ్రమైన దుష్పరిణామాలు, ప్రాణాపాయ స్థితి లాంటివి రాకపోవచ్చు. కానీ ఇన్‌ఫెక్షన్ రాకుండా రోగ నిరోధక శక్తి ఆపలేదు. అది కొంత వరకే పనిచేస్తుంది.. అంతేకానీ.. ఇమ్యూనిటీ పవర్ ఉన్నంత మాత్రాన కరోనా రాదని కాదు.. ఆ విషయాన్ని సైంటిస్టులు నిరూపించలేదు. అందుకనే ప్రభుత్వాలు ప్రజలకు ఇమ్యూనిటీ టెస్టులు చేయడం లేదు.
అయితే నిజంగానే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి కరోనా సోకదని ఒకవేళ శాస్త్రీయంగా నిరూపణ అయితే మాత్రం అది మనకు ఎంతగానో మేలు చేసినట్లవుతుంది. జనాల రోగ నిరోధక శక్తి పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని ఆ దిశగా కరోనా కట్టడికి యత్నించవచ్చు. పౌష్టికాహారాన్ని, విటమిన్లు, మినరల్స్ ఉండే మందులను ప్రజలకు సరఫరా చేస్తూ.. వారి రోగ నిరోధక శక్తిని పెంచితే దాంతో కరోనా రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కనుక కరోనా సోకదు. అయితే ఇది సాధ్యమయ్యే పనికాదు. కానీ ఇమ్యూనిటీ టెస్టులు చేసి, వాటి పరంగా కరోనా సోకుతుందా, లేదా అన్న విషయాలను అధ్యయనం చేస్తే.. కొంత మేర ఈ విషయంలో సక్సెస్ సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారిస్తాయో, లేదో చూడాలి..!