యాంకర్ అనసూయ కి విజయ్ దేవరకొండ అంటే ఎందుకు అంత పగ?? విజయ్ దేవరకొండ ఆమెకి అన్యాయం చేశాడా ?

-

సాధారణంగా యాంకర్స్ ఎప్పుడు హీరోలను మచ్చిక చేసుకోవడం కోసమే ఉంటారు..ఎందుకంటే వాళ్ళ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇంటర్వూస్ ని చేసే అవకాశం వస్తుంది కదా అని..అన్ని సరిగ్గా కుదిరితే హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి కదా అని భజన ఒక రేంజ్ లో చేసే యాంకర్స్ ని మనం సోషల్ మీడియా లో గమనించొచ్చు..కానీ ఎంత పెద్ద స్టార్ ని అయినా లెక్క చెయ్యకుండా తనకి నచ్చిన విధంగా కామెంట్ చేస్తూ అనిపించింది అనిపించినట్టు చెప్తూ బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్న యాంకర్ కూడా ఒకరు ఉన్నారు..ఆమె మరెవరో కాదు అనసూయ గారే..జబర్దస్త్ యాంకర్ గా విపరీతమైన క్రేజ్ ని దక్కఁమ్చుకున్న ఈమె..ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో సినిమాల్లో కూడా అవకాశాలను సంపాదించింది..ఇప్పుడు ఈమె పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పుడు అనసూయ మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరిగా ఇండస్ట్రీ లో చలామణి అవుతుంది..ఈమెకి దర్శక నిర్మాతలు ఎప్పుడు కూడా విలన్ రోల్స్ ఇవ్వడానికే ఎక్కువ మక్కువ చూపిస్తారు.

అయితే ఈమెకి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ అంటే అసలు పడదు అనే విషయం ఈమె ట్వీట్స్ ని ఫాలో అయితే అర్థం అవుతుంది..అసలు ఎందుకు ఈమెకి విజయ్ దేవరకొండ అంటే అంత పగ..ఎందుకు ఎప్పుడు ఆయనని టార్గెట్ చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము..విజయ్ దేవరకొండ ప్రభంజనం టాలీవుడ్ లో ప్రారంభం అయ్యింది అర్జున్ రెడ్డి అనే సినిమా తో..సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపేసింది..విడుదలకు ముందు నుండే ఈ సినిమాకి భారీ హైప్ అప్పట్లో ఉండేది..దానికి కారణం ఈ సినిమా టీజర్..ఈ టీజర్ లో విజయ్ దేవరకొండ ‘ఎం మాట్లాడుతున్నావ్ రా మదర్ చోర్’ అనే డైలాగ్ అనసూయ కి అసలు నచ్చలేదు..అప్పట్లో ఆమె ఈ విషయం ని బాహాటంగానే ట్విట్టర్ లో తెలిపింది..దీనికి అప్పట్లో ఆమెని నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేసేవారు.

ఇక ఈరోజు విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ మూవీ విడుదల అయ్యి డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీనితో అనసూయ సంబరం కి హద్దులే లేకుండా పోయింది..టాక్ రాగానే ఆమె ట్వీట్ వేస్తూ ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!’ అంటూ విజయ్ దేవరకొండ ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేసింది..దీనికి నెటిజెన్స్ ఇంత నీతులు చెప్తున్నా నువ్వు జబర్దస్త్ వంటి బూతు షో కి యాంకర్ గా ఎలా పని చేసావు..నీకో న్యాయం మిగిలిన వాళ్లకు ఒక న్యాయమా..సినిమాని సినిమాలాగా చూడకుండా నువ్వు చేసే కామెంట్స్ చాలా సిల్లీ గా ఉన్నాయి..ఇప్పుడు నువ్ ప్రతి సినిమాలో విలన్ గా నటిస్తున్నావు..నిజ జీవితం లో కూడా నువ్ మంచి దానివి కాదా..ఇన్ని ఏళ్ళు వచ్చాయి..ఇంకా నీకు బుద్ది రాలేదు అంటూ నెటిజెన్స్ అనసూయ పై ఒక రేంజ్ లో నెగటివిటీ చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version