జగన్ ప్రెస్ మీట్ వెనుక అర్ధం ఏంటి…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా కారణంగా వాయిదా వేస్తున్నామని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికలను వాయిదా వేసుకున్నారు. దానికి ఇంత హడావుడి చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, వైసీపీ నేతలు, సిఎం జగన్ నుంచి కింది స్థాయి వరకు మీడియా సమావేశాల్లో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ని ఉద్దేశించి కులం పేరుతో తిట్టడం ఏంటీ…?

అసలు దీనికి కారణం ఎమై ఉంటుంది…? ఎన్నికలను వాయిదా వేయడం కారణంగా కేంద్ర నిధులు ఆగిపోతాయని అంటున్నారు. గతంలో ఎప్పుడు ఎన్నికల కారణంగా నిధులు ఆగిన సందర్భం లేదు. ఇక ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ. అది తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా పై స్థాయిలో చర్చించే తీసుకుంటుంది. అలాంటి ఎన్నికల సంఘం కేవలం కులం ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందా…?

రేపు పై స్థాయిలో సమాధానం ఎం చెప్పుకుంటుంది అలా నిర్ణయం తీసుకుంటే. జగన్ కంగారు పడటం వెనుక, వైసీపీ నేతలు మీడియా సమావేశాల వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండవచ్చు అని అంటున్నారు. ఏదో కారణం లేకుండా ఈ విధంగా విమర్శించడం అనేది సాధ్యం కాదు. బలమైన కారణం తోనే వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని, ఇది కచ్చితంగా తప్పుడు సంకేతాలు తీసుకుని వెళ్తుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version