సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటికి ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్నిటినీ ఈ ఫిల్మ్ తిరగ రాసింది. ఇందులో మెహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్స్ గా భానుప్రియ, సౌందర్య నటించారు. కాగా, హిట్ పెయిర్ గా అప్పటికే పేరున్న జయసుధ ఈ చిత్రం వద్దనుకుందట. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
‘కల్యాణ తిలకం’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘ఏడు అడుగుల బంధం’, ‘శివ రంజిని’లతో వీరు జంటగా ఆన్ స్క్రీన్ పైన చక్కగా కనిపించారు. ఈ నేపథ్యంలో ‘పెదరాయుడు’ చిత్ర షూటింగ్ కు ముందర స్టోరి జయసుధకు వినిపించారట.
స్టోరిలో భాగంగా ఇందులో మోహన్ బాబుకు డ్యూయెట్ ఉండటం జయసుధకు నచ్చలేదట. తాను ఈ మూవీ చేయనని చెప్పిందట. అలా ఈ పిక్చర్ భానుప్రియ వద్దకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు క్రేజ్ అమాంతంగా పెరిగింది. రికార్డు వసూళ్లు చేసిన ఈ సినిమా తమిళ్ రీమేక్.
‘నాట్టమై’ అనే పిక్చర్ తమిళ్ రైట్స్ తీసుకున్న రజనీకాంత్..ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ‘పెదరాయుడు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ కు సీనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోటీ మ్యూజిక్ అందించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు.