తెలంగాణ బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు బడ్జెట్‌లో అన్యాయం చేస్తే కేంద్రంపై ఇప్పటికి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు పడుతున్నాయి కాబట్టే తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెట్టినా.. కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ,బీహార్‌లలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినందుకే భారీగా నిధులు కేటాయించారన్నారు అని ఆరోపించారు.వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న భయంతోనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపిందని విమర్శించారు. వ్యవసాయ రంగానికే రూ.73 వేల కోట్లు బడ్జెట్‌లో తాము ఉంచామని అయినా బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.