పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది.మహిళలపై పెప్పర్ స్పై కొడుతూ ఓ యువకుడు రచ్చ చేశాడు…ప్రైవేట్ పార్ట్‌పై టచ్ చేసి కూడా హింసించాడట. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాత బస్తీలోని పిల్లలు, మహిళలపై స్ప్రే చేసి వెనుక నుంచి అదిమి పట్టుకుంటున్నాడట యువకుడు. పిల్లలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడట ఆ యువకుడు.
నోరు ముక్కు మూసేసి అభ్యంతరకర చేష్టలు చేస్తున్నాడు యువకుడు. ఇవాళే కాదు.. గడిచిన రెండు రోజుల్లో నాలుగు చోట్ల దాడులకు పాల్పడ్డాడట యువకుడు. ఇలాంటి పనులు చేసి… మెరుపు వేగంతో బైక్ పై పారిపోతున్న యువకున్ని పట్టుకునేందుకు ప్రయత్నించారట స్థానికులు. ఇక దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. మహిళల పట్ల అభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఎవరికోసం గాలిస్తున్నారు పోలీసులు.