టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ సాధించి దాదాపు మూడు నెలలు అవుతుంది. అయితే కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు. కోహ్లీ ని సెలక్టర్లు పక్కన పెట్టాలి అంటూ ఇటీవల మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కోహ్లీ కి అండగా నిలబడ్డారు సునీల్ గవాస్కర్.
రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదని, మరే ఇతర ఇతర ఆటగాడు ఫామ్ లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని, ఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని గవాస్కర్ కామెంట్స్ చేశాడు. ఫామ్ తాత్కాలికం.. క్వాలిటీ పర్మినెంట్ అని అన్నారు గవాస్కర్.” కొన్నిసార్లు బాగా ఆడాలన్న ప్రయత్నంలో బ్యాటర్లు విఫలం అవుతారు. అందుకు ఒక ఆటగాడిని లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ చేయడం సరికాదు.
ఇంగ్లాండ్ పై దూకుడుగా ఆడాలని కోహ్లీ అనుకున్నాడు. కానీ త్వరగా అవుట్ అయ్యాడు. టి-20 ప్రపంచకప్ కి ఇంకా టైం చాలా ఉంది. జట్టును ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీ బాధ్యత వహిస్తుంది. ఈ విషయం గురించి వారే ఆలోచిస్తారు”. అని సునీల్ గవాస్కర్ అన్నారు.