బీజేపీ ఫోర్సులో లేదన్న షర్మిల వ్యాఖ్యల్లో ఆంతర్యం ఆ ప్లేస్ దక్కించుకోవడమేనా?

-

తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భావించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల, తాజాగా మీడియాలో మాట్లాడారు. పాదయాత్ర, ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసారు. అందులో భాగంగానే బీజేపీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, ప్రస్తుతం బీజేపీ ఫోర్సులో లేదని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం బీజేపీతో గ్లవ్స్ వేసుకుని కరచాలన స్నేహం చేస్తుందంటూ కౌంటర్లు వేసారు.

బీజేపీ ఫోర్సులో లేదన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం అని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న తర్వాత బీజేపీ శ్రేణుల్లో నమ్మకం పెరిగింది. జీహెచ్ఎమ్ సీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కూడా వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీ ఫోర్సులో లేదు అన్న షర్మిల మాటలు అందరికీ షాక్ కలిగించాయి.

ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే బీజేపీ బాగా బలపడిందనే చెప్పాలి. మునుపటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. అటు టీఆర్ఎస్ నాయకులకు గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తున్నారు. టీఆర్ఎస్ ని ఎదిరించి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే అని పదే పదే చెబుతున్నారు. షర్మిల కూడా ప్రస్తుతం ఇదే చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. పదే పదే టీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద గొంతు వినిపిస్తున్నారు.

దానివల్ల ప్రజల్లో ప్రత్యామ్నాయం కనిపించాలని ప్రయత్నిస్తున్నారు. అందువల్లే బీజేపీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ ను ఎదిరించేది బీజేపీ అనుకుంటున్న ప్రజల్లో వైయస్సార్ టీపీ ముద్ర పడిపోవాలన్న కాంక్ష ఉందని, అందువల్లే బీజేపీ గురించి తక్కువ మాటలు మాట్లాడి, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version