ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలలో దాదాపుగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా లాంచ్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోల తనయులు కథానాయకులుగా ఇండస్ట్రీకి వచ్చేశారు. అలా వారసుల ఎంట్రీ అనేది అంత ఈజీ అయినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరో, ‘సోగ్గాడు’, అందగాడు శోభన్ బాబు ఆయన తనయుడిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. అందుకు గల కారణమేంటో తెలుసుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న నటుడు శోభన్ బాబు. అందం, అభినయంతో ‘సోగ్గాడి’గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు.. సూపర్ హిట్ పిక్చర్స్ ఎన్నో చేసి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయారు. ముఖ్యంగా మహిళలు అయితే శోభన్ బాబు సినిమాలు అంటే చాలా ఇష్టపడేవారు.
సెంటిమెంట్ తో పాటు కామెడీ ప్లస్ ఎమోషన్.. ఇలా అన్ని హావ భావాలను వెండితెరపైన చూపించి శోభన్ బాబు..తన సినిమాలతో డిఫరెంట్ మేనియా క్రియేట్ చేశారు. ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్న క్రమంలోనే మరి కొందరు స్టార్ హీరోలు తమ వారసులను సినీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.
శోభన్ బాబుకు కూడా ఆ అవకాశం ఉంది. తన తనయుడిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు. కానీ, ఆయన ఆ పని చేయలేదు. ఒకానొక సందర్భంలో ఈ విషయమై శోభన్ బాబును ఈ విషయం గురించి అడగగా, ఆయన సమాధానం కూడా చెప్పారు.
‘సార్ మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయరా?’ అని అడగగా, శోభన్ బాబు ఆసక్తికర సమాధానం చెప్పారట. తాను హీరోత ఎంత టెన్షన్ పడుతున్నానో తనకు మాత్రమే తెలుసు.. ఈ టెన్షన్స్ తన కొడుకుకు అవసరం లేదని అనిపించింది అందుకే వాడిని ఇండస్ట్రీకి దూరంగా ఉంచానని శోభన్ బాబు చెప్పాడట. అలా తన తనయులను ఇండస్ట్రీకి దూరంగా ఉంచిన విలక్షణ వ్యక్తిత్వం శోభన్ బాబు సొంతం అని చెప్పొచ్చు.