కొత్త వస్తువుల్లో ఎందుకు ఆ చిన్న ప్యాకెట్లని పెడతారంటే..?

-

ఎప్పుడైనా గమనించినట్టైతే మనం ఏమైనా కొత్త వస్తువులని కనుక కొంటే దానిలో మనకి చిన్న ప్యాకెట్లు కనిపిస్తాయి. ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులలో, చెప్పులలో, కొత్త బట్టల్లో, హ్యాండ్ బ్యాగులలో, పర్సులలో ఇలా మొదలైన వాటిల్లో మనకి ఎక్కువుగా ఈ చిన్న ప్యాకెట్లని చూస్తుంటాము. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? ఏమిటి ఈ చిన్న ప్యాకెట్లని..? మరి తెలియకపోతే ఇప్పుడే పూర్తిగా చదివేసి వాటి గురించి మీరే తెలుసుకోండి.

ఈ ప్యాకెట్లు ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఈ పాకెట్లనే సిలికా జెల్ పాకెట్లు అని కూడా పిలుస్తారు. మనం చూసే ఉంటాం ఈ పాకెట్ లపై “డు నాట్ ఈట్” అని, “కీప్ అవే ఫ్రొమ్ ద చిల్డ్రన్” అని రాసి ఉంటుంది. కేవలం సిలికా జెల్ ప్యాకెట్ల పై మాత్రమే కాకుండా ఇలాంటి పదాలు ఇతర ప్యాకెట్ల పై కూడా రాసి ఉంటాయి. వీటిలో ఎటువంటి విష పదార్ధాలు ఉండవు. ఈ సిలికా జెల్ ప్యాకెట్ల లో సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్థం ఉంటుంది. అయితే ఇది ఉండటం వల్ల కొత్తగా కొన్న వస్తువుల లో ఉన్న తేమను పీల్చు కోవడానికి ఎంతో బాగా సహాయ పడుతుంది.

వీటి వల్ల ప్రమాదం కూడా ఏమి ఉండదు. పొరపాటున ఎవరైనా వీటిని తిన్న.. వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎక్కువ మోతాదు లో తీసుకున్నట్లయితే కొంత వరకు మాత్రమే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ ఏది ఏమైనా పిల్లల నుండి దూరంగా ఉంచడం మంచిది. కానీ పీకల ప్రమాదం అయితే మాత్రం కలుగదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version