తొమ్మిది నుంచి 12వ తరగతులకు సంబంధించిన సిలబస్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్… ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు పాఠాలు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి మరికొన్ని అంశాలు తొలగించింది. దీంతో కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ రియాక్ట్ అయ్యారు.
”పాఠ్య పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి? సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలి? బాధితులుగా ఎలా మారాలి? అనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా? ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం అని ప్రశ్నించారు . అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో వారికెందుకు.” అని ఓ మీడియాకి ఇంటర్వ్యూలో దినేశ్ సక్లానీ తెలిపారు.