భర్త తో గొడవ పడి.. పిల్లలతో భార్య అదృశ్యం…!

-

భర్త చిత్ర హింసల కి గురి చేస్తున్నాడని ఇద్దరు పిల్లల తో కలిసి భార్య అదృశ్యమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే పహడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజుపేట మండల్ రంగనాథ పురానికి చెందిన హసీనా అలియాస్ రేణుక కి టైలర్ అయినా యాసిన్ తో గత కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అఫ్రీన్ 14 , హుస్సేన్ 8 భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది.

డిసెంబర్ 18న భర్త గొడవ పడుతున్నాడని హసీనా తన తల్లి కి ఫోన్ చేసి చెప్పింది. ఆ తరవాత 18 వ తేదీన హసీనా ఇద్దరు పిల్లల్ని తీసుకుని అదృశ్యమైంది. ఇంకా ఈమె ఇంటికి తిరిగి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసుని పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news