ప్రేమవివాహం..నీ వెంటే నేనుంటానంటూ భార్య కూడా…!

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరణించడంతో నీ వెంటే నేనుంటా అంటూ భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ లో చోటు చేసుకుంది. ఎస్సై గౌస్ తెలిపిన వివరాల ప్రకారం….మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల మహేశ్వరి రమేష్ అనే వక్తిని ఎనిమిదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రమేష్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 6న మృతించెందాడు.

Wife suside after husband death
Wife suside after husband death

అప్పటి నుండి మహేశ్వరి భర్తనే తలచుకుంటూ బాధపడుతోంది. తీవ్ర మనసికవేదనతో మహేశ్వరి ఆదివారం తెల్లవారుజామున ఊర్లో ఉన్న చెరువులో దూకింది. అయితే అక్కడకు చేరుకున్న స్థానికులు వెంటనే రక్షించేందుకు చెరువులో దూకారు. కానీ అప్పటికే చెరువులో మునిగి రాజేశ్వరి మృతి చెందింది. ఈఘటన పై సమాచారం అందడంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక పదిహేను రోజుల్లోనే దంపతులు ఇద్దరూ మరణించడంతో వారి పిల్లలు ఇద్దరు అనాథలు అయ్యారు. పిల్లలు తల్లి తండ్రుల కోసం రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది.