బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవ్వబోతోందా..?

-

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమాధిగా పేరు మార్చిన విషయం మనకి తెలిసిందే. అయితే పేరుని మార్చడం పై పార్టీలో సీనియర్లకి కార్యకర్తలకు ఇష్టం లేదని పొలిటికల్ సర్కిల్ లో టాక్ అయితే నడిచింది. పార్టీ పేరుని టిఆర్ఎస్ గా ఉంటేనే బాగుంటుందని పార్టీ వర్గాల్లో ఇదివరకే చర్చలు సాగాయి.

తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ విజయాన్ని మిస్ చేసుకున్న గులాబీ పార్టీ డామేజ్ కంట్రోల్ చేయడానికి పాత పేరుని కొనసాగించాలని గతంలోనే కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకో పక్క పాత పేరు కొనసాగించడం మీద ఎమ్మెల్యేకి కడియం శ్రీహరి ఇటీవల లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ కి సూచించారు. దీంతో బిఆర్ఎస్ పేరుని టిఆర్ఎస్ గా ఉంచాలన్న డిమాండ్ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version