3 అడుగులు లేని రేవంత్‌.. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున పాతిపెడతామంటున్నారు : కేటీఆర్

-

ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన చీల్చిచెండాడంలో కేసీఆర్‌ను మించినవారు లేరని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్‌ కంటే పదునైన గొంతు దేశంలో లేదని స్పష్టం చేశారు. 3 అడుగులు లేని సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతున పాతిపెడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ పలికేవన్ని ప్రగల్భాలేనని మండిపడ్డారు. గులాబీ జెండా కనబడకుండా చేస్తామని రేవంత్‌రెడ్డి కంటే ముందు చాలా మంది చెప్పారని.. అలాంటి వారి వల్ల కానిది… ఈ రేవంత్‌ వల్ల ఏమౌతుందని వ్యాఖ్యానించారు. కాలం కలిసివస్తే వానపాములు కూడా నాలుపాములై బుసలుకోడతాయని ఎద్దేవా చేశారు.

“రేవంత్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. దిల్లీ మేనేజ్‌మెంట్‌ కోటా ముఖ్యమంత్రి. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులు మీకు దక్కేవా? హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతున్నారు. మేడిగడ్డలో అవినీతి… ఇక్కడ అవినీతి.. అక్కడ అవినీతి అని కథలు చెబుతున్నారు. అధికారం మీ చేతులోనే ఉంది.. అవినీతిని వెలికితీయమనే చెబుతున్నాం.” అని సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version