బీఆర్ఎస్ అధినేత ,మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అని ప్రశ్నించారు. చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు.అయితే కేసీఆర్ మాత్రం కరీంనగర్ను పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చూసే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చాయి. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది అని అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తా అని తెలిపారు. వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలి అని కోరారు.