బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిగా పొన్నాల..?

-

పొన్నాల లక్ష్మయ్యకి కాంగ్రెస్ లో జనగామ టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సర్వేల పేరుతో సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని.. పార్టీలో చేరని వారికి సర్వే అద్భుతంగా ఉందని.. బీసీ నాయకుల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు పొన్నాల.  తెలంగాణ రాష్ట్రంలో తొలి పీసీసీగా కొనసాగానని గుర్తు చేశారు. కొత్తగా పార్టీకి వచ్చిన వారు.. భూములు ఇస్తేనో.. విల్లాలు ఇస్తేనో టికెట్లు ఇస్తున్నారు. మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను నడుచుకోవడం లేదు.. రెండున్నరేళ్లుగా పార్టీలో తనకు అవమానం జరుగుతుందని.. సర్వేల్లో తన పేరు లేదని టికెట్ నిరాకరించారని తెలిపారు పొన్నాల. సొంత పార్టీలో ఉన్నవాళ్లం మేము పరాయి వాళ్లమయ్యామని మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తొలుత ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ తో పొన్నాల భేటీ కానున్నారని తెలిసింది. కానీ అక్టోబర్ 16న జనగామలో కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. అదేరోజు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నాల అని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవీని అప్పగించింది ప్రభుత్వం. ఇంకా జనగామ టికెట్ ను బీఆర్ఎస్ ప్రకటించకపోవం పొన్నాల పేరు ప్రస్తుతం చర్చకొస్తుంది. పొన్నాలకు దక్కుతుందో.. లేక పల్లాకు దక్కుతుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version