కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రైతుల కోసం కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. ప్రతి ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందిస్తోంది కేంద్రం. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఈ డబ్బులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి పడతాయి.
ఇప్పటికే 12 విడతల డబ్బులు జమ అయ్యాయి. 13 విడత విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ 13 విడతలో పీఎం కిసాన్ సహాయం రూ.8 వేలకు పెంచుతున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఇక పూర్తి వివరాలని చూస్తే.. వార్తలు వచ్చినా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. కానీ ఇప్పుడు విషయంపై పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడగగా క్లారిటీ ఇచ్చింది కేంద్రం.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రభుత్వాన్ని అడిగితే అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఏమి లేదు అని రాతపూర్వంగా సమాధానమిచ్చారు. అర్హత కలిగిన రైతులకి
రూ.6 వేలని ఇస్తామన్నారు. ఈ స్కీమ్ ని రైతుల కోసం 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద వ్యవసాయ భూమి ఉన్న అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ.6 వేల ని ఇస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు సార్లు రైతులకి అందుతాయి.