టీ ని వేడి చేసుకుని తాగితే.. క్యాన్సర్ వస్తుందా..?

-

చాలా మంది టీ ని ఇష్టపడుతూ ఉంటారు. రోజుకి రెండు, మూడు సార్లు కూడా చాలా మంది టీ ని తాగుతూ ఉంటారు. అయితే టీ తాగే వాళ్ళు కచ్చితంగా కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. రోజూ అదే పనిగా టీ తాగడం మంచిది కాదు. టీ తాగడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏ ఆహార పదార్థాలు అయినా అతిగా తీసుకోవడం వలన అనర్ధాలు తప్పవు. అయితే, చాలా మంది చల్లారిపోయిన టీ ని మళ్ళీ వేడి చేసుకుని తీసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇలా టీ ని వేడి చేసుకోవడం వలన కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి క్యాన్సర్ కి కారణం అవుతుందని పోస్ట్ వచ్చింది.

కానీ దీనిపై ఎలాంటి ఆధారాలు లేవు. ఆరోగ్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చల్లారిపోయిన టీ ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తీసుకోవడం వలన క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. ఇలా తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పలేము. అయితే టీ ని వేడి చేసుకుని తీసుకోవడం వలన దాని రుచి మారిపోతుంది.

పైగా పోషక విలువలు తగ్గిపోతాయి. పంచదార, పాలు వేసిన టీ ని 15 నిమిషాల తర్వాత మళ్లీ హీట్ చేసుకుని తీసుకోవడం వలన కొన్ని ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు, డిస్ కంఫర్ట్ ఐలా పలు సమస్యలు ఎదుర్కోవాలి కాబట్టి టీ ని వేడి చేసుకుని తీసుకోవడం మంచిది కాదు. ఒకసారి మరిగిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోండి ఒకవేళ టీ చల్లారిపోయింది అంటే అలాగే తీసుకోండి తప్ప వేడి చేసి తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version