వీర్రాజు ఎత్తుకున్న బీసీ పాట బీజేపీని నిలబెడుతుందా..?

-

రాజకీయాల్లో అధికారం దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఏ పనిచేస్తే ప్రజల్ని తమ పార్టీవైపు తిప్పుకోగలమో అని పార్టీ నాయకులు ఆలోచిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఆసక్తి కలిగిస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు వీర్రాజు కొత్త పాట పాడుతున్నాడు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్ని చెప్పడమే ఆ పాట సారాంశం. ఐతే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. స్వయంగా కాపు వర్గానికి చెంచిన వీర్రాజు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడమే అందరికీ ఆశ్చర్యంగా తోస్తుంది.

ఐతే ఇదో సరికొత్త వ్యూహంలా తోస్తుంది. సాధారణంగా ఓటర్లలో బీసీల జనాభానే ఎక్కువ. వాళ్ళ మద్దతు లేకుండా అధికారం దక్కించుకోలేరని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టడానికి నాయకత్వం పనిచేస్తూనే ఉంది. అలా పనిచేయడంలో ఇదో సరికొత్త వ్యూహమని చెబుతున్నారు. బీసీకి అధికారం ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే అని చాలా మంది అంటున్నారు. మరి వీర్రాజు ఎత్తుకున్న కొత్త పాట ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని నిలబెడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version