సింగరేణి కార్మికులకు అండగా ఉంటా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనివల్ల రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోయామని అన్నారు. ఓడిపోయిన బాధలో కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే తనకు ముఖ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

కాగా, నిన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలు చేశారు.తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు..తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు..సింగరేణి కార్మికులపై అభిమానం లేదు.. ఇద్దరికీ పట్టలేనంత సంతోషం..మాటల్లో చెప్పలేనంత ఆనందం..అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం..వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి..వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి..పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులా..?సిరుల గనికి మరణశాసనం రాస్తూ… చిద్విలాసమా ?వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ?ఈ ఆరునెలలైనా గ్యారెంటీలు అమలుచేయలేని.. అసమర్థత నుంచి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news