డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లతో టెస్ట్‌లకి ఆదరణ పెరుగుతుందా..?

-

పింక్‌బాల్‌ టెస్ట్‌కి అంతా సిద్ధమైంది. రేపు అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కి పింక్‌ బాల్‌ స్పెషల్‌గా అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అటు వైట్‌బాల్‌ కాకుండా.. ఇటు రెడ్‌ కాకుండా పింక్‌ బాల్‌ వాడటం..టెస్ట్‌లకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ తీసుకొచ్చిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఇప్పుడు ఆసక్తిరేపుతుంది.

టెస్ట్‌ మ్యాచ్‌ అనగానే ఉదయం ప్రారంభమై..లంచ్‌, టీ సెషన్ల తర్వాత ముగిసే మ్యాచ్‌..! ఇది ఇన్నాళ్లు అనుకున్నదీ.. కానీ టీ ట్వంటీ మోజులో ఆదరణ కోల్పోతున్న టెస్ట్‌లకు జోష్‌ పెంచేందుకు ఐసీసీ పింక్‌ బాల్‌ టెస్ట్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రతి సిరీస్‌లో ఒక పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఉండేలా చూసుకుంటోంది. ఫుల్‌ డేలో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంటే.. అదంతా బోరు ఎవరు చూస్తారన్న ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి.

అయితే టెస్ట్‌లను డే అండ్‌ నైట్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఇది ప్రతిరూపం. అందుకే సిరీస్‌ ఒకటి చొప్పున డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. బుధవారం మొతేరాలో జరగబోయే మ్యాచ్‌ కూడా ఇలాంటిదే..! అయితే డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో తప్పనిసరిగా పింక్‌ బాల్‌నే వాడుతున్నారు. అందుకే దీనిని పింక్‌బాల్‌ టెస్ట్‌ అని పిలుపుచుకుంటోంది క్రికెట్ ప్రపంచం.

సాధారణంగా టెస్టుల్లో రెడ్‌ బాల్‌ను వాడుతుంటారు. కానీ కొన్ని ఓవర్లు ఆడిన తర్వాత రెడ్‌బాల్‌ కలర్‌ కోల్పోతుంది. బ్రౌన్‌గా మారుతుంది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆ బాల్‌ను గుర్తించడం ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే సాధారణ టెస్ట్‌ల్లోగా.. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లకు రెడ్‌ బాల్‌ను వాడరు..ఇక్కడ పింక్‌ బాల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది అంత త్వరగా రంగును కోల్పోదు. ఫ్లడ్‌లైట్ల వెలుగులోనూ స్పష్టంగా కనబడుతుందని చెబుతున్నారు. ఆరేంజ్‌తో పాటు ఎల్లో బంతులపై ప్రయోగాలు చేసినప్పటికీ.. పింక్‌ బాల్‌ టెస్ట్‌లో ఎక్కువగా ఫలితాలు వచ్చాయి. ఇది కొంచెం ఎక్కువగా స్వింగ్‌ అవుతుందని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కొందరు క్రికెటర్లకు పింక్‌బాల్‌తోనూ సమస్యలు ఉన్నాయి. పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఆస్ట్రేలియాదే పైచేయి..భారత్‌ గతంలో ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో ఆడింది. అందులో చిత్తుగా ఓడింది. బంగ్లాదేశ్‌తో ఈడెన్‌గార్డెన్‌లోనూ ఆడింది. ఇప్పుడు మొతేరాలో మోత మోగించేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ డే అండ్‌ నైట్ టెస్ట్‌ మ్యాచ్‌కి టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.

అయితే ఈ టెస్ట్‌ సాధారణ టెస్టుల మాదిరిగా.. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాదు..మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగుతుంది. ఇక మూడో టెస్ట్‌ గెలుపు టీమిండియాకు కీలకమైంది. ఇందులో గెలిస్తే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కి దూసుకెళ్లొచ్చు. అందుకే శ్రమిస్తోంది. ఫ్లడ్‌లైట్ల కింద ప్రాక్టీస్‌ చేస్తోంది టీమిండియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version