బీజేపీ చేసిన ప‌ని వ‌ల్ల టీఆర్ఎస్‌కు ప్ల‌స్ అవుతుందా..

-

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజ‌కీయాలు ఎలా సాగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా టీఆర్ ఎస్ అలాగే బీజేపీ అన్న‌ట్టు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో తెలంగాణ‌కు మీరెంత చేశారు అంటే మీరు ఎంత చేశార‌నే స్థాయిలో విమ‌ర్శ‌లు, స‌వాళ్లు సాగుతున్నాయి. ఇక ఎన్నిక ఏదైనా స‌రే బీజేపీ తెలంగాణ‌కు ఏం ఇచ్చిందంటూ టీఆర్ ఎస్ ప‌దే ప‌దే ప్ర‌చారంచేస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయ‌కుండా మహారాష్ట్ర కు షిఫ్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇది ష‌ఫ్ట్ చేయ‌డం ఇప్పుడు బీజేపీకి పెద్ద మైన‌స్ అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ తీరును ఇప్పుడు అంద‌రూ కూడా త‌ప్పుబ‌డుతున్నారు. ఇక మహారాష్ట్రకు షిఫ్ట్ చేసిన కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా చాలా వేగంగా జ‌ర‌గుతున్నాయి. ఈ ఫ్యాక్ట‌రీ నిజానికి రాష్ట్ర విభజన చ‌ట్టంలో భాగంగా చ‌ట్ట‌బ‌ద్ధంగా తెలంగాణాకు రావాలి. కానీ బీజేపీ అలా ఇవ్వ‌కుండా దాన్ని కాస్తా మ‌హారాష్ట్ర‌కు షిఫ్ట్ చేసింది. ఇక తెలంగాణ‌కు ఇప్ప‌ట్లో ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పేస్తోంది.

అస‌లు ముందుగా మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కోచ్ ఫ్యాక్టరీలు అవ‌స‌రం లేద‌ని, మ‌న దేశంలో కావాల్సిన‌న్ని బోగీలు ఉన్నాయి కాబ‌ట్టి ఎలాంటివి అవ‌స‌రం లేద‌ని తెలిపింది. కానీ ఇలా చెప్పిన త‌ర్వాత మ‌న ద‌గ్గ‌ర సాంక్ష‌న్ అయిన రైల్వేబోర్డు కోచ్ ఫ్యాక్టరీని ఏకంగా మ‌హారాష్ట్ర‌కు తీసుకెళ్ల‌డంపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇక దీన్ని ఇప్పుడ టీఆర్ ఎస్ ప్ర‌చార అస్త్రంగా మ‌లుచుకుని బీజేపీపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లుచేసే అవ‌కాశం ఉంది. బీజేపీ తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని టీఆర్ ఎస్ నిరూపిస్తే అప్పుడు బీజేపీకి ఇక్క‌డ ఎక్కువ‌గా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం లేక‌పోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version