వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుతుంది అని మాజీలు చెప్పిన నాలుగు జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. కానీ టోర్నమెంట్ ఆరంభం అయ్యాక పాకిస్తాన్ ప్రదర్శనను చూస్తే వీరి అభిప్రాయం కరెక్ట్ కాదేమో అన్న వాదన బయట బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్ లలో మూడింటిలో ఓడిపోవడమే. ముఖ్యంగా నిన్న ఆఫ్గనిస్తాన్ పై ఓడిపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. ఒక బలమైన జట్టు నుండి ఇంత సాధారణమైన ప్రదర్శనను అస్సలు ఊహించలేదంటూ చాలా మంది చెబుతున్నారు. ఇక వీరు ఈ విధంగా ఆడడానికి కారణం జట్టు సభ్యులలో ఒకరితో ఒకరికి సరైన బాంధవ్యం లేదని అంటున్నారు. ముఖ్యంగా బాబర్ అజాం ను కెప్టెన్ గా జట్టులోని సభ్యులే స్వీకరించడం లేదంటూ కామెంట్ లు వస్తున్నాయి.
అందుకే బాబర్ అజమ్ ఒంటరిగా అయిపోయి జట్టును సమర్ధవంతమగా నడిపించడంలో తడపడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముగింపు పలికింది.. జట్టులో సభ్యులు అంతా సంతోషంగానే ఉన్నారు అని క్లారిటీ ఇచ్చింది.