తమిళ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత అప్పుడప్పుడు రాజకీయాల్లో ఉంటూ.. సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది. ఈ తరుణంలోనే త్వరలోనే తొలిసారి బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ గురించి తాజాగా మరో నటుడు విశాల్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సభపై తాను ఆసక్తిగా ఉన్నానని.. పిలవకపోయినా తాను వెళ్తానని చెప్పుకొచ్చారు విశాల్.
విజయ్ ర్యాలీకి హాజరవుతున్నారా..? అంటూ ఓ విలేకరీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తనకు ఓటు హక్కు ఉందని.. విజయ్ తన తొలి ప్రసంగంలో ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఒక ఓటరుగా తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ నాయకీయ నాయకుల కంటే భిన్నంగా విజయ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. దీనికి నాకు ఆహ్వానం అవసరం లేదు. టీవీలో చూడటం కంటే సభకు వెళ్లి సాధారణ ప్రజల మధ్య ఒకడిగా నిలబడి తెలుసుకుంటేనే బాగుంటుందనేది తన అభిప్రాయం తెలిపారు విశాల్.