అక్రమాలకు తావు లేకుండా ఆవాస్ లబ్దిదారుల ఎంపిక : కేంద్ర మంత్రి పెమ్మసాని

-

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అక్రమాలకు ఎలాంటి తావు లేకుండా అర్హులైన వారందరికీ లబ్ది చేకూర్చేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద చేపట్టే నిర్మాణాలపై గుంటూరులోని ఆర్అండ్ బీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. అక్రమాలకు తావు లేకుండా అర్హులకు ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. 

అసంపూర్తిగా ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి పెమ్మసాని. రాబోయే ఐదేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని పార్థసారథి తెలిపారు. 2014-19 యూనిట్ ఖరీదు రూ.2.5 లక్షలుంటే.. వైసీపీ హయాంలో రూ.1.8లక్షలకు తగ్గించినట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని తెలిపారు.కాలనీలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తేనే లబ్ధిదారులు ముందుకు వస్తారని వెల్లడించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 

Read more RELATED
Recommended to you

Latest news