చివరి సినిమాకు విజయ్ అంత రెమ్యునరేషన్ తీసుకోనున్నాడా?

-

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే.

ఇక ఆయన స్థాపించిన పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం తన చివరి సినిమాను హెచ్. వినోద్ చేయనున్నారు. పూర్తిగా రాజకీయ కోణంలో సాగే ఓ కథను హెచ్ వినోత్ ఆయనకు చెప్పినట్ల తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా ఉంటుందని దళపతి భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, ఈ సినిమాకి విజయ్ రికార్డు స్థాయిలో రూ.250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది గోట్’ కోసం కూడా ఆయన రూ.200 కోట్లు తీసుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news