వచ్చే ఎన్నికల్లో నైనా హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. ఉప ఎన్నికలకు ముందు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ప్రజలు టిఆర్ఎస్ కు ఓటు వేయలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో నైనా దయ చూపాలన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి లాంటి పథకాలు లేవన్నారు మంత్రి. కేంద్రంలో పనికిరాని ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉందన్నారు.
పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు మంత్రి గంగుల కమలాకర్. ఆడపిల్లలు సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు గంగుల. తెలంగాణలో నీటి కొరత లేదని, గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో బిందెలతో నీటి కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారని అన్నారు గంగుల.