నేటి నుంచి మద్యం షాపులు ఓపెన్…!

-

దేశంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోతుంది. అటు ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో మద్యం షాపులను తెరిచే ఆలోచన చేస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. మద్యం లేక పిచ్చి ఎక్కుతుంది జనాలకు. దీనితో ఈశాన్య రాష్ట్రాలు అయిన అసోం, మేఘాలయ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మద్యం షాపులను తెరవాలని భావిస్తున్నాయి.

నేటి నుంచి మద్యం షాపులను తెరవాలని భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే యోచనలో ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మేఘాలయా, అసోం లో మద్యం అమ్మకాలు ఉంటాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అసోంలో 17 వరకు అమ్ముతుండగా… మేఘాలయాలో మాత్రం ఏ తేదీ ప్రకటించలేదు. ఆ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక సామాజిక దూరం పాటించడమే కాదు ప్రజలు ఎవరూ ఒక్కసారే దుకాణాల వద్దకు రాకుండా పోలీసులతో నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు స్పష్టమైన హెచ్చరికలను కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొన్ని రాష్ట్రాలు మద్యం విషయంలో… చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జనాలు బయటకు రాకుండా హోం డెలివరి చెయ్యాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి.

Read more RELATED
Recommended to you

Latest news