తెలుగు రాష్ట్రాలను చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం 11 గంటలు కానీదే చలి తీవ్రత తగ్గడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమఖం పడుతున్నాయి. దీంతో తెలంగాణ చలికి వణుకుతోంది. మఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు రాత్రి ఉష్టోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి చలిగాలులు మరింత బలంగా వచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ చలిగాలులు ఫిబ్రవరి మొదటి వారం వరకు వీస్తుందని వెల్లడించింది.
తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని నిర్మల్, అదిలాబాద్, మంచిర్యాల, కొమ్రంభీం జిల్లాల్లో అల్యత్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి కోహిర్ లో 8.9 డిగ్రీాల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్యం చలికి గజగజ వణుకుతోంది. వాయువ్య, మధ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. ముంచంగిపుట్టులో 8.8, డుంబ్రీగూడ 9, అరకు లోయలో 9.4, జి. మడుగులలో9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి