ఆందోళ‌న విర‌మించిన ఏపీ ఉద్యోగులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 7 నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌ బాట ప‌ట్టాయి. అయితే తాజా గా ఉద్యోగ సంఘాలు త‌మ ఆందోళ‌న‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తమ డిమాండ్ ల‌పై సానుకూలం గా స్పంధించిందని అందుకే ఆందోళ‌న‌ను తాత్కాలికం గా వాయిదా వేస్తున్నామ‌ని ఏపీ జేఏసీ చైర్మెన్ బొప్ప రాజు వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. అలాగే త‌మ డిమాండ్ల పై రాత పూర్వ‌కంగా హామీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.

అలాగే ఈ విష‌యం పై ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌మావేశానికి సంబంధించిన మినిట్స్ కూడా ఇస్తామ‌ని తెలిపింద‌ని అన్నారు. కాగ ఏపీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. ఏపీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ద‌శ‌ల వారీగా ప‌రిష్క‌రిస్తామ‌ని హామీనిచ్చారు. క‌రోనా తో పాటు మ‌రి కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కాస్త ఆల‌స్యం అయింద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version