తెలంగాణ‌లో వ‌ణికిస్తున్న చ‌లి పులి..!

-

తెలంగాణ‌లో చ‌లిపులి వ‌ణికిస్తోంది. రాష్ట్రంలో ఊష్ణోగ్ర‌త‌లు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతున్నాయి. రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల పాటు చ‌లి ప్ర‌భావం ఇలానే ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెబుతున్నారు. చ‌లి పెర‌గాటానికి కార‌ణంగా ఉత్త‌ర ఈశాన్య భారతం నుండి తెలంగాణ వైపు గాలులు వీస్తుండ‌ట‌మేన‌ని చెబుతున్నారు. ఆదివారం నాడు హైద‌రాబాద్ స‌హా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో అత్య‌ల్ప ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌యిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆదివారం ఆదిలాబాద్ లో 16.8 డిగ్రీల ఊష్ణోగ్ర‌త న‌మోదు కాగా హైదరాబాద్ లో 18.6 డిగ్రీల ఊష్ణోగ్ర‌త న‌మోదైంది. అంతే కాకుండా అత్య‌ల్పంగా సంగారెడ్డి న‌ల్ల‌వెల్లిలో 15.7 డిగ్రీల ఊష్ణోగ్ర‌త న‌మోద‌య్యింది. ఇదిలా ఉండ‌గా రాత్రివేళ ఊష్ణోగ్ర‌త‌లు ఇంత త‌క్కువ‌గా న‌మోద‌వ‌డం ఈ యేడాదే క‌నిపిస్తుంద‌ని వాతావర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రారంభంలోనే చ‌లి ప్రభావం ఇలా ఉంటే రాను రాను ఇంకెలా ఉంటుందా అని ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version