లోక్ సభ శీతాకాల సమావేశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. పాత భవనంలో కాకుండా కొత్త భవనంలో సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. సాంకేతిక భద్రత పరంగా చూస్తే పాత భవనం తో పోలిస్తే కొత్త భవనం ఎంతో ముందు ఉంటుందని అన్నారు. అయితే పార్లమెంటు భవనం కూడా కొత్త దాంట్లో భాగంగా ఉంటుందని ఓం బిర్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పార్లమెంటు ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఓం బిర్లా అన్నారు. సభ్యులందరి సహకారంతో సభను రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలు తమ నేతలతో మాట్లాడాలని స్పీకర్ అన్నారు. తాను కూడా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి సభ సజావుగా సాగాలని, క్రమశిక్షణ, సభా మర్యాదలు పాటించాలని చెబుతూనే ఉంటానని చెప్పారు. సభ్యుల సహకారంతో ఉత్పాదకత, చర్చల స్థాయి గణనీయంగా పెరిగిందని అన్నారు.