ఈ టెక్నాలజీ తో ఫోన్ ఛార్జింగ్ కష్టాలకి ఇక చెక్..!

-

రోజు రోజుకీ స్మార్ట్ ఫోన్ వాడకం మరింత ఎక్కువై పోతోంది. దీనితో కొత్త చిక్కు కూడా వస్తోంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులను వేధిస్తున్న సమస్య ఛార్జింగ్. కాసేపు ఫోన్ ని ఉపయోగిస్తే చాలు చిటికెలో  ఛార్జింగ్ అయ్యిపోతోంది. దీనితో వినియోగదారులు పవర్ బ్యాంక్ , ఛార్జింగ్ పాయింట్ల కోసం వెతుకులాట ఆడడం కామన్ అయ్యిపోయింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన రియల్ మీ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని కనిపెట్టింది. దీనికి అల్ట్రాడార్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ అని పేరు పెట్టింది.

realme

అయితే దీని వల్ల మనకి ఉపయోగం ఏమిటంటే? కేవలం 20 నిమిషాల్లోనే మొత్తం ఛార్జింగ్ ఎక్కుతుంది. 4000 MAH బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ తక్కువ సమయంలోనే మొత్తం చార్జింగ్ కావడం వల్ల వినియోగదారులకి ఎంతో సౌకర్యం కలుగుతుందని రియల్ మీ సంస్థ చెప్పింది. ఇంత సులువుగా ఛార్జింగ్ అయ్యిపోవడం వినియోగదారులకు మంచి సౌకర్యం అని చెప్పాలి. కేవలం మూడు నిమిషాల్లోనే 33 శాతం  ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్పింది.

అలానే ఫోన్ హీట్ కూడా అవ్వదని చెప్పారు. ఫోన్ యొక్క ఉష్ణోగ్రత 40 డిగ్రీల కూడా మంచిదని రియల్ మీ అంటోంది. కేవలం 13 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. అదే 5 జీ టెక్నాలజీ ఫోన్ కి మరో ఆరేడు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. గేమ్స్ ఆడుతూ కూడా ఛార్జింగ్ ని పెట్టవచ్చని చెబుతోంది రియల్ మీ. అలానే ఈ ఏడాది ఫిబ్రవరిలో రియల్ మీ ఎక్స్ 50 ప్రో 5 జీ ఫోన్లో 65w ఛార్జింగ్ సదుపాయం అందించింది. కేవలం రియల్ మీ మాత్రమే కాకుండా ఒప్పో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ని అందించింది అయితే రియల్ మీ మాత్రం ఎప్పుడు ఈ టెక్నాలజీని మార్కెట్లో విడుదల చేస్తున్నది అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిని వినియోగించాలంటే వినియోగదారులు ఆగక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version