ఈ రకం బొప్పాయి సాగుతో ఒక్కో బీగాకు రూ. 5 లక్షల లాభం..

-

వ్యవసాయం ఎవరైనా చేస్తారు.. కానీ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంట వేయడం, లాభాలు వచ్చేలా సాగు చేయడం మాత్రం కొందరే చేయగలుగుతారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూడా లక్షల్లో సంపాదించవచ్చు. అలా సేంద్రీయ వ్యవసాయం చేసే బీహార్‌కు చెందిన ఓ రైతు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే..ఇతను బొప్పాయిని పండిస్తూ.. ఒక్కో బీగాకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు.

బీహార్‌కు చెందిన వినోద్ కుమార్ సింగ్ అనే రైతు స్థానికంగా బొప్పాయి పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. తాజాగా రెడ్ లేడీ-786 రకం బొప్పాయిని 7 బీగాల్లో (2.31 ఎకరాలు) సాగు చేసి అద్భుత దిగుబడి సాధిస్తున్నాడు. ఒక్కో బిగాకు (1 బిగా అంటే 0.33 ఎకరం) 5 లక్షల రూపాయల లాభం వస్తుందని రైతు వినోద్ సింగ్ తెలిపారు. ఈయన జిల్లాలో చక్కి తాలూకాలోని అరక్ గ్రామ నివాసి. ఆయన పొలం చందా గ్రామ సమీపంలో ఉంది. 7 బిగాల్లో (2.31 ఎకరాలు) బొప్పాయి సాగు చేస్తున్నారు.

గత 25 ఏళ్లుగా వాణిజ్య పంటలు సాగుచేస్తున్నట్లు సింగ్ తెలిపారు. బొప్పాయి సాగు కోసం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శిక్షణ తీసుకుని గతేడాది 2 బీగాల్లో (0.66 ఎకరాలు) సేంద్రియ పద్ధతిలో బొప్పాయి సాగు చేశాడు. ఈ వ్యవసాయానికి రూ.2 లక్షలు ఖర్చు కాగా, రూ.9 లక్షల లాభం వచ్చింది. ఖర్చుకు మించి లాభం అనేక రెట్లు పెరగడంతో మక్కువ పెరిగి ఈ సారి 2 బిగాల నుంచి 7 బిగాల (2.31 ఎకరాలు) వరకు బొప్పాయి సాగు చేశానని సింగ్ తెలిపారు. రెడ్ లేడీ-786 రకం బొప్పాయి సాగు బాగుందన్నారు. అలాగే బొప్పాయి బరువు కూడా బాగుంటుంది, రుచి తియ్యగా ఉంటుంది.

రెడ్ లేడీ రకం ఒక బొప్పాయి మొక్క క్వింటాల్ కంటే ఎక్కువ ఫలాలను ఇస్తుందని రైతు వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. దీని మార్కెట్ కూడా బాగుందనీ, రేట్లు కూడా బాగున్నాయని వివరించారు. ఒక్కో బిగాకు అయ్యే ఖర్చు 1 లక్ష రూపాయలు కాగా ఒక్కో బిగాకు రూ.5 లక్షల లాభం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ రైతు ప్రకారం ఒక బొప్పాయి సాధారణంగా 4 నుంచి 5 కేజీల బరువు ఉంటుంది. ఈ విధంగా 2 నుంచి రెండున్నర కేజీల వరకు బరువున్న బొప్పాయిలు చాలా కాస్తాయి.

ఈ రకం బొప్పాయి విత్తనాలు, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చాయని సింగ్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నుంచి బొప్పాయి సాగు జరుగుతుందన్నారు. పండ్లు ఏప్రిల్ నుంచి వస్తాయి. ఈ బొప్పాయి ఆగస్టు నెలలో పక్వానికి రావడం ప్రారంభమవుతుంది, తర్వాతి 6 నెలల వరకూ పక్వానికి వస్తుంది. మొత్తంగా పొలంలో ఏడాదిన్నరపాటూ బొప్పాయి దిగుబడి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version