రోడ్లు లేక మా గ్రామంలో అబ్బాయిలకు పిల్ల నిస్తలేరు : స్పీకర్

-

వార్షిక బడ్జెట్ పై చర్చ సందర్భంగా శాసనసభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. చర్చలో భాగంగా రోడ్ల నిర్మాణం అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేశామని హరీశ్ రావు చెప్పగా..

కలుగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మా వికారాబాద్ జిల్లాల్లో రోడ్లు లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని సంచలన కామెంట్స్ చేశారు.దీంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా ఘోల్లున నవ్వారు. అధికార పక్షం వైపు నుంచి షేమ్ షేమ్ అంటూ నినాదాలు వినిపించాయి. అనంతరం మాట్లాడిన హరీశ్ రావు పాత మండలాల ప్రకారం అన్ని మండలాల్లో రోడ్లు వేశామని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news