వృక్షో రక్షితి రక్షిత: చెట్టును మనం కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుందని ఇది జగమెరిగిన సత్యం అని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నేను చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయంలోనే వృక్ష సంరక్షణ ఉన్నదని తెలిపారు. వృక్షో రక్షతి రక్షిత: చెట్టును మనం కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుంది.
అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించి.. ప్రతి ఏటా నిర్వహిస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారం. జీవజలానికి, వనాలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. అడవులను ప్రజలు తమ స్వలాభం కోసం నాశనం చేస్తూ.. తమ ఉనికినీ తామే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని తెలిపారు.