ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ మహిళను కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్రగా గుర్తించారు. సీఎం అపాయింట్మెంట్ లభించినందు వల్లే మనస్తాపంతో ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెం కి చెందిన ఆరుద్ర కి లక్ష్మీ చంద్ర అనే కూతురు ఉంది. ఆమె పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతుంది.
ఆమె చికిత్స కు రెండు కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో.. కూతురి వైద్యం కోసం అన్నవరంలో ఉన్న ఇంటిని అమ్మేందుకు ఆరుద్ర ప్రయత్నించింది. అయితే ఆమె ఆమె ఇంటిని అమ్మనివ్వకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్, మరో కానిస్టేబుల్ తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరుద్ర ఆరోపిస్తుంది. తన కుమార్తెను కాపాడాలని సీఎం జగన్ ని వేడుకునేందుకు ఆమె సీఎం కార్యాలయం వద్దకు వచ్చింది. అయితే సీఎం అపాయింట్మెంట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.