వాస్తు: తులసి మొక్క వద్ద వీటిని అస్సలు ఉంచకూడదు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి చెయ్యకూడదని తప్పుల గురించి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి కోట దగ్గర ఈ తప్పులు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ కలిపి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే ఇబ్బందులు కూడా వస్తాయి. ఆనందమే ఉండదు. వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పులని కానీ షూలని కానీ అస్సలు తులసి మొక్క దగ్గర పెట్టకూడదు. కాబట్టి ఈ తప్పుని అస్సలు చెయ్యద్దు. దీనివల్ల ఆనందంగా ఉండడానికి అవ్వదు.

చీపురు కట్టని కూడా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి కోట దగ్గర ఉంచకూడదు ఇలా చేయడం వలన డబ్బుల్ని కోల్పోవాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు వస్తాయి. తులసి మొక్క దగ్గర ముళ్ళని ఉంచకూడదు ఇవి కూడా నెగిటివ్ ఎనర్జీ ని కలిగిస్తాయి పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తాయి. కనుక అసలు ఉంచకూడదు. తులసి మొక్క దగ్గర శివలింగాన్ని కూడా పెట్టకూడదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version