వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ !

-

మనిషి జీవితంలో నిద్ర చాలా.. ముఖ్యమైన అంశం. కంటినిండా నిద్ర ఉంటేనే… మనం ఉదయాన్నే లేచి ప్రశాంతంగా పని చేసుకో గలుగుతాము. ఒకరోజు లేదా రెండు రోజులు ఆరోగ్యకరమైన నిద్ర లేకపోతే… మనమే అనారోగ్యం పాలు అయిపోతాం. అయితే మహిళా ఏకంగా 40 ఏళ్ల నుంచి అసలు నిద్ర పోవటం లేదట. ఎంత ప్రయత్నించినా ఆమె అసలు నిద్ర పట్టడం లేదట.

ఇలాంటి వింత వ్యాధి చైనాలో వెలుగులోకి వచ్చింది… చైనాకు చెందిన జ్యానింగ్ అనే మహిళ వయస్సు 45 సంవత్సరాలు. ఈమె గత నలభై సంవత్సరాల నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. ఈ వింత జబ్బు ఆమెను ఒక్క సెకండ్ కూడా నిద్రపోనివ్వను లేదు. చిన్నప్పుడు తప్ప గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడు ఆ మహిళ నిద్ర పో లేదట.

ఆమెకు వివాహమై… దాదాపు 25 సంవత్సరాలు పూర్తయింది. వివాహమైనప్పటికీ ఆమె నిద్రపోకుండా ఉంటుంది. ఈ విషయంలో ఆమె భర్త.. ఎంతో మంది వైద్యులను మరియు ఆసుపత్రులు తిరిగినా… ప్రయోజనం జరగలేదు. ఈ వింత వ్యాధి ఎవరికి చూపించినా… తనకు అర్థం కావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆమె భర్త కూడా ఏమీ చేయలేక ఉండిపోతున్నాడు. ఇక ఇలాంటి వ్యాధి తానెప్పుడూ చూడలేదని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news