ఈటల రాజేందర్ కు మరో షాక్ తగిలింది. శివకుమారి అనే మహిళ ఈటల రాజేందర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2011 నుండి ఓ ఫుడ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నానని… అప్పటి నుండి రేషన్ షాప్ లకు కంది పప్పు సరఫరా చేస్తాన్నానని ఓ ప్రకటన విడుదల చేసింది ఆ మహిళ. తెలంగాణ వచ్చాక కూడా తాను రేషన్ షాప్ లకు కంది పప్పు సప్లై చేయడానికి టెండర్లు వేశానని.. ఏపీ లో హుదూద్ తుఫాన్ రావడం తో కంది పప్పు సప్లై లో కొంత ఆలస్యం వచ్చిందని తెలిపింది.
ఆ తరుణంలో మాకు కాదని ఇతరులకు టెండర్ల ద్వారా కేటాయింపు చేశారని… దీనివలన మేము తీవ్రంగా నష్టపోయాం,బ్యాంక్ ల ద్వారా లోన్ తీసుకున్నాం అప్పులు పెరిగిపోయాయని పేర్కొంది. సివిల్ సప్లై నుండి మేము టెండర్ ద్వారా సప్లై చేస్తున్నాము…టెండర్లు తమకు కాకుండా ఇతరులకు కేటాయింపు చేశారని తెలిపింది. కోటి 97 లక్షల 57 వేలు కట్టి మేము టెండర్ లో పాల్గొన్నామని.. ఈటల రాజేందర్ తమను బ్లాక్ లిస్ట్ చేసి.. అన్యాయానికి గురిచేశారని ఆరోపించారు. తమకు అన్యాయం చేసి మిగత వారీకి టెండర్ లు ఇచ్చారని.. ఈటల పై ఆరోపణలు చేశారు శివకుమారి.
అడవాళ్ళం అని చూడకుండా మమ్ములను బ్రోకర్ అని సంబంధించి నానా మాటలు అన్నారని…దీనిపై సీఎం కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అవినీతి పరుడైన ఈటల రాజేందర్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు శివకుమారి. ఈటల రాజేందర్ సివిల్ సప్లై లో 2 వేల కోట్ల స్కామ్ చేశారని…దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు శివకుమారి. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు శివకుమారి.