PONDS ఫేస్‌క్రీమ్ రాసుకుంది.. కోమాలోకి వెళ్లింది..

-

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ప్రతి ఒక్క సౌందర్య పోషణకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందంగా కనిపించేందుకు ఏవైనా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత సాంప్రదాయ పద్ధతులు వదిలేసి… చాలా త్వరగా అందంగా కనిపించాలని.. నాజూకుగా మారిపోవాలని మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఫేస్ క్రీములు వాడటంతో పాటు బ్యూటీ పార్లర్ లను ఆశ్రయిస్తున్నారు. ఈ బ్యూటీ పార్లర్‌లలో రసాయనాలతో కూడిన క్రిముల వల్ల కొన్నిసార్లు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రిత‌మే ఓ మ‌హిళ ముఖంగా అందంగా ఉండేందుకు వాడిన ర‌సాయ‌న క్రీముల‌తో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ ఫేస్ క్రీమ్ కారణంగా కోమాలోకి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. తన ముఖంపై విపరీతంగా మచ్చలు ఉండడంతో వాటిని తొలగించుకునేందుకు ఆ మహిళ ఫేస్ క్రీమ్ కొనుగోలు చేసింది. ప్రత్యేకంగా మెక్సికో నుంచి ఆ క్రీమ్ తెప్పించింది.

ఈ క్రీమ్ ఆమె పూసుకుందో లేదో వెంట‌నే తీవ్ర‌మైన అస్వస్థతకు గురైంది. ఆమెకు ఒక్క‌సారిగా ఊపిరి ఆడ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, కొన్నిరోజులకే కోమాలోకి జారుకుంది. చివ‌ర‌కు ఏం జ‌రిగిందో ? ఆమెను ప‌రిశీలించిన వైద్యుల‌కు కూడా అర్ధం కాని ప‌రిస్థితి.

ఆమె వాడిన క్రీమ్ పరిశీలించిన వైద్యులు అందులో మిథైల్ మెర్క్యురీ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని అరుదైన సందర్భాల్లో ఆ రసాయనం విషప్రభావాన్ని సంతరించుకుంటుందని వివరించారు. అది కల్తీ ఫేస్ క్రీమ్ అయ్యుంటుందని, అందుకే వికటించి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ర‌సాయ‌నాల‌తో ఉన్న బ్యూటీ క్రీమ్స్ ఎంత డేంజ‌రో ఈ విష‌యం చెపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version