మహారాష్ట్రలో ఓట్లు కోసం మూసీ నిద్ర డ్రామాలు : శ్రీధర్ బాబు

-

పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని BJP నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు మంత్రి. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికైనా ఆ ప్రాంత వాసుల సమస్య తెల్సిరావొచ్చు. కలుషితమైన నీరు, గాలి మధ్య మూసీ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు.

అయితే మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో పార్టీ పై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీ ప్రజలకు మంచి నీరు, మంచి ఇల్లు, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇక్కడి ప్రజలు ఓట్లు వెలిస్తే ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే డిపిఆర్ రానివ్వండి.. శాస్త్రీయంగా గోడలే కట్టలో ఇంకేమైనా చెయ్యాలో సలహాలు ఇవ్వండి అని శ్రీధర్ బాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version