లవర్ తో కలిసి భర్త హత్య.. తాగిన మైకంలో అందరికీ చెప్పేసిన ప్రియుడు

-

బతుకు దెరువు కోసం తెలంగాణకు వచ్చింది ఆ జంట. పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరు ఏకాంతంగా కలిసి ఉండటం చూసిన భర్త ఆమెను మందలించాడు. అతడిపై కోపం పెంచుకున్న ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. కానీ తాగిన మైకంలో ప్రియుడు.. ఆ విషయాన్ని అందరి దగ్గర వాగేశాడు. ఇంకేం పోలీసులకు దొరికిపోయి ఇద్దరు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం ఇటుకల పహాడ్‌లో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అటవీశాఖ ప్లాంటేషన్​లో కూలీ పనుల కోసం దేవేందర్, పార్వతి అనే దంపతులు మధ్యప్రదేశ్​ నుంచి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే పార్వతికి రామ్​లాల్​ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారింది. గత ఆదివారం భార్య పార్వతి ప్రియుడు రామ్​లాల్​తో ఏకాంతంగా ఉండడం చూసి భర్త దేవేందర్ పార్వతిని మందలించాడు.

ప్రశ్నించిన భర్తను భార్య పార్వతి ప్రియుడితో కలిసి కర్రతో బాది గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత..  తాగిన మైకంలో ఈ విషయాన్ని రామ్ లాల్ తన తోటి కూలీలతో చెప్పాడు. ఆ కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version