వేసవిలో విరివిగా దొరికే కాయలు మామిడి కాయలు..మార్చి, మే నెలలో మాత్రం ఇవి ఎక్కువగా వస్తాయి..మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది..రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష..
ఆమె మాటల్లోనే ఆ వ్యాపారం గురించి పూర్తీ వివరాలను తెలుసుకుందాం..ఆమె పత్తి సాగును చేసేవాల్లు..ఆ పత్తిని మార్కెట్ చేస్తున్న సమయంలో ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది..ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం.అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్‌చూర్ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్‌లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలని అనుకుంది..
ఈ వ్యాపారం కోసం మొదట 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం.
ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశారు.ఒక్కో ఏడాది మార్కెట్ ను పెంచుతున్నారు.కొన్నిసార్లు మార్కెట్ సరిగ్గా లేక నష్టాలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అయిన వదలకుండా అదే పనిలో వున్నారు..ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది.
వర్క్ చూసి డీఆర్‌డీఎ, వి-హబ్ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్ ప్రింట్‌కు, ప్యాకింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్‌చూర్ పొడిని మా సొంత లేబుల్‌తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నామని, ఇంకా బిజినెస్ ను పెంచే ఆలోచనలు చేస్తున్నామని చెప్పింది…