ఏపీలో దారుణం.. వివాహితను నిర్భందించి నెల రోజులు అత్యాచారం

-

వివాహితను నెల రోజుల పాటు రెండు చోట్ల నిర్బంధించి అత్యాచారం చేసిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. బాధిత మహిళతో పాటు దళిత సంఘాల నాయకులు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారు. తిరుపతి అంబేడ్కర్‌ భవనం ఛైర్మన్‌ దుగ్గాని జయరాం, దళిత ఐక్యవేదిక నాయకులు కత్తి హరి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన ఓ వివాహిత  తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. బలిజపల్లికి చెందిన వ్యక్తి గత ఏడాది నవంబరు 17న వివాహిత పని చేస్తున్న పాఠశాలకు వెళ్లాడు. తనతోవస్తే బ్యాంక్‌లోన్‌ ఇప్పిస్తానని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించి ప్రతిఘటించడంతో పాఠశాల ఆవరణలో బెదిరించి, కొట్టి బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి 5రోజుల పాటు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పాకాల మండలం దామలచెరువులోనూ కొన్నిరోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడని చెప్పింది. అనంతరం ఆమెను స్వగ్రామంలో విడిచిపెట్టాడు. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. గ్రామ పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో ఈ ఏడాది జనవరి 6న తిరుపతి జిల్లా ఎస్పీ, దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ రామరాజుకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని దళిత సంఘాల నాయకులు వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version