నెల కరెంట్ బిల్లు రూ.3వేల కోట్లు.. షాకైన ఓనర్​!

-

ఒకటో తారీఖు రాగానే ఇంటి అద్దె.. ఐదో తారీఖున కరెంట్ బిల్లు చూసి చాలా మంది బెంబేలెత్తిపోతారు. ప్రతి నెలా ఉండే ఖర్చే అయినా.. ఈ నెల ఎక్కువ విద్యుత్ వాడామేమోనన్న భయం.. మీటర్ ఎంత తిరిగిందో.. ఎంత బిల్లు వస్తుందోనన్న దిగులు ఉండనే ఉంటుంది. సాధారణంగా నెలకు వచ్చే కరెంటు బిల్లు ఓ వంద రూపాయలు ఎక్కువొస్తేనే అల్లాడిపోతాం అలాంటిది ఓ వ్యక్తికి ఏకంగా మూడు వేల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగర శివ్‌విహార్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా కుటుంబం అయిదారు రోజుల కిందట తమ ఇంటికి వచ్చిన విద్యుత్తు బిల్లును చూసి కళ్లు తేలేసింది. రూ.3,419 కోట్ల విద్యుత్తు బిల్లు చూసిన ఆ ఇంటిపెద్ద (ప్రియాంక మామ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

జులై 20న వచ్చిన ఈ బిల్లును విద్యుత్తుశాఖ పోర్టల్‌ ద్వారా పరిశీలించినా అంతే మొత్తం ఉన్నట్లు వచ్చిందని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్‌ కంకణె అన్నారు. విషయాన్ని స్టేట్‌ పవర్‌ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా, జరిగిన పొరపాటును గుర్తించి రూ.1,300గా సవరించారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. విద్యుత్తు బిల్లు పంపిణీకి వచ్చిన ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌లో ‘యూనిట్లు’ అని ఉన్నచోట పొరపాటున వినియోగదారు సంఖ్యను రాశారు. దీంతో బిల్లు రూ.కోట్లలోకి వెళ్లి కొండెక్కింది. సంబంధిత విద్యుత్తు ఉద్యోగిపై చర్య తీసుకుంటామని విద్యుత్తుశాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version