వాహనదారులు కొందరు ప్రభుత్వ నిబంధనలను మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రతి చిన్నదానికి సహనం కోల్పోయి ఎదుటి వారి మీదకు దాడికి దిగుతున్నారు. సాధారణంగా టోల్ ప్లాజా సెంటర్లలో ఫాస్టాగ్ ద్వారా బిల్లులు చెల్లిస్తుంటారు వాహనదారులు. అందులో బ్యాలెన్స్ అయిపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కానీ, ఓ మహిళా టోల్ ప్లాజా ఉద్యోగిని నాలుగు సెకన్లలో ఏడు సార్లు చెంప చెల్లుమనిపించింది. ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడంతో, టోల్ చెల్లించాలని ఉద్యోగి అడగడంతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన యూపీలోని హావూర్ జిల్లా చెజార్సీ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకోగా.. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. కాగా, సదరు మహిళ మీద నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
టోల్ ప్లాజా ఉద్యోగిని నాలుగు సెకన్లలో ఏడు సార్లు చెంప వాయించిన మహిళా
ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడంతో, టోల్ చెల్లించాలని ఉద్యోగి అడగడంతో దాడి చేసినట్లు సమాచారం
యూపీలోని హావూర్ జిల్లా చెజార్సీ టోల్ ప్లాజా వద్ద ఘటన.. pic.twitter.com/8OjTeJuJkm
— Telangana Awaaz (@telanganaawaaz) April 15, 2025