సూడాన్‌లో అంతర్యుద్ధం.. 114 మందికి పైగా మృతి!

-

సూడాన్‌లో అంతర్యుద్ధం నెలకొంది. 114 మందికి పైగా మృతి చెందారు. ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఇటీవల పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి దిగాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లదించారు.

Civil war in Sudan More than 114 people killed
Civil war in Sudan More than 114 people killed

జాబ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా మృతి.. పలువురికి గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు బలగాలు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news